‘మేజర్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో అడవి శేష్ మాట్లాడుతూ, సినిమా నిర్మాణంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు చాలా సహకారం అందించారని తెలిపారు. ఈ సినిమాకు మొదటి ప్రేక్షకులు వాళ్లేనని అన్నాడు ఒక్కగానొక్క కొడుకు మేజర్ సందీప్ జ్ఞాపకాలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనేది వారి ప్రధాన ఆశ అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను తాను ఏడుసార్లు కలిశానని చెప్పాడు. మొదట వాళ్లు ఒప్పుకోలేదు కానీ చాలా ప్రయత్నాల తర్వాత మాట్లాడేందుకు అనుమతించారని తెలిపాడు. నేను సినిమాలో సందీప్‌లా కనిపించేందుకు వాళ్లు చాలా హెల్ప్ చేశారని చెప్పాడు.