వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలేంటో ఖరారయ్యాయి. చిరంజీవి నటిస్తున్న మెగా 154 జనవరి 11 న విడుదల కానుంది. ఈ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జనవరి 12న ప్రేక్షకులను పలకరించనుంది. అటు తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు సినిమాలు వస్తున్నా తెలుగులో మాత్రం ఆదిపురుష్, మెగా 154 మధ్యనే ప్రధా పోటీ అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
సంక్రాంతి బరిలో ఆదిపురుష్, మెగా 154
