తమిళ స్టార్ హీరో విజయ్‌కి తెలుగులోనూ ప్రత్యేక అభిమానులున్నారు. విజయ్ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసి ఈ నెల 4కి 30ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా విజయ్ నటించిన ‘అదిరింది’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో సాయంత్రం 6 గంటలకు స్పెషల్ షోను వేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నిత్యామేనన్, కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు.