మేజర్, హిట్2 సినిమాలతో అడివి శేష్ వరుస విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ‘గూడఛారి 2’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, శేష్ సోదరి పెళ్లి వేడుక ఉండటంతో శేష్ స్వల్ప విరామం తీసుకున్నాడు. ఈ నెల 26న హైదరాబాద్‌లో శేష్ సోదరి శిర్లే పెళ్లి జరగనుంది. ఈ మేరకు హల్దీ వేడుక నిర్వహించారు. శేష్‌తో పాటు హాస్య నటుడు వెన్నెల కిశోర్ కూడా కార్యక్రమంలో భాగమయ్యాడు. డేవిన్ గుడ్రిచ్తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట ఒక్కటి కానుంది.