‘మేజర్’ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే అడివి శేష్ మాత్రం ఈ సినిమా ఫలితంతో ఇంకా సంతృప్తిగా లేనని చెప్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నాకు ఈ సినిమా విషయంలో ఎన్ని కోట్లు వచ్చినా అది సరిపోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు ఎంత వచ్చినా అది తక్కువే అని చెప్పాడు. మేజర్ సందీప్, ఆయన జీవితం అంతకంటే గొప్పది అనే భావాన్ని వ్యక్తం చేశాడు.