తెలంగాణ క్యాడర్ అలాట్మెంట్ కేసు విచారణను హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ కేసును రెగ్యులర్ బేంచ్ విచారిస్తుందని వెల్లడించింది. డీజీపీ అంజనీకుమార్ సహా మరో 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ క్యాడర్‌కు కేంద్రం కేటాయించింది. క్యాట్ ట్రిబ్యునల్ తీర్పుతో వీరంతా తెలంగాణలో కొనసాగుతున్నారు. 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు హైకోర్టులో ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇటీవల తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్వర్ కుమార్‌ను ఏపీకి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.