ఏపీ ప్రభుత్వ జీవో నంబర్ 1పై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 23న హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో రోడ్ షోలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి చేస్తూ వైసీపీ సర్కారు జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. దీనిని సవాలు చేస్తూ ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ను విచారించిన హైకోర్టు.. జీవో1పై స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.