జపాన్ వాసి కెనిచి హోరీ 83 ఏళ్ల వయసులోనూ నేనింకా కుర్రాడినే అంటున్నారు. కర్ర సాయం లేనిదే నడవలేని వయసులో సముద్రాలు దాటి ఔరా అనిపిస్తున్నారు. 8పదుల వయసులో ఈ వృద్ధ యువకుడు పసిఫిక్ మహాసముద్రంలో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జపాన్ కు ఒంటరిగా పడవ ప్రయాణం చేశారు. 2 నెలలకు పైగా సముద్రంంలో ప్రయాణించి క్షేమంగా తీరానికి చేరుకున్నారు. కెనిచి సాహసంపై అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.