TSPSCలో లీక్ అయిన పేపర్లు ఏఈ పరీక్షకు సంబంధించినవని పోలీసుల దర్యాప్తు తేలింది. దీంతో TSPSC నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షను రద్దు చేయాలా? లేదా ఇద్దరికే లీక్ అయిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో భేటిలో చర్చించనుంది. కాగా, నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష పేపర్స్‌తో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్