టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు 1లో ఉన్న అఫ్గానిస్థాన్‌ను దురదృష్టం వెంటాడుతోంది. వర్షం కారణంగా మరో మ్యాచ్ తుడుచుకు పెట్టుకుపోయింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు కాగా, తాజాగా ఐర్లాండ్‌తోనూ ఇదే అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. దీంతో అంపైర్లు చెరో పాయింట్‌ని ఇరు జట్లకు కేటాయించారు. గత మ్యాచులో ఇంగ్లాండ్‌పై విజయంలో ఐర్లాండ్‌కు వర్షం కలిసొచ్చింది. కానీ, అఫ్గాన్‌పై గెలుస్తామని పట్టుదలతో ఉన్న ఐరిష్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. దీంతో గ్రూపు 1 సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి.
AFGvsIRE మ్యాచ్ వర్షార్పణం

Courtesy Twitter:@T20WorldCup