కేరళలో ఆఫ్రికన్ ఫ్లూ విజృంభిస్తోంది. అక్కడి కోళ్ల ఫామ్స్‌లో వ్యాధి సోకిన కోళ్లను యాజమాన్యాలు తగలబెడుతున్నాయి. క్యాటిల్ ఫామ్‌లోనూ వైరస్ సోకిన పశువులను చంపివేస్తున్నారు. ఆఫ్రికన్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ మరింత విస్తరించకుండా అంతరాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించింది. కేరళ, తమిళనాడు బోర్డర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో కూడా కొన్ని కేసులు నమోదైనట్లు తెలిసింది. ఆఫ్రికన్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.