సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ముంబయిలో కేసు విచారణకు అఫ్తాబ్ వెళ్లినప్పుడు శ్రద్ధా ఫోన్ తన వద్దనే ఉందని వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తిరిగి దిల్లీకి పయనమవుతుండగా శ్రద్ధా ఫోన్ని, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సముద్రంలో పడేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకొన్నాడని తెలిపాయి. మే 18న శ్రద్ధాను అఫ్తాబ్ చేశాడు. ఈ విషయం తెలియని శ్రద్ధా తల్లిదండ్రులు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగానే అఫ్తాబ్ ముంబయికి వెళ్లాడు.