2024 జనరల్ ఎన్నికల తర్వాత ఇండియా మొత్తం 50 రాష్ట్రాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి బెళగావిలో విలేకరులతో తెలిపారు. జనాభా విపరీతంగా పెరిగిపోయినందున 50 రాష్ట్రాలప్రతిపాదన బానే ఉంటుందని ఆయన ప్రకటించారు. త్వరలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించనుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో రెండు, యూపీలో 4, మహారాష్ట్రలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయని మంత్రి తెలిపారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనను కేంద్రానికి పంపలేదన్నారు.