కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నప్పుడల్లా హిట్ పడేదని హీరోయిన్ కలర్స్ స్వాతి చెప్పింది. తన జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ నా కెరీర్‌లో నేను చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఎప్పటికప్పుడు ఒక సినిమా తర్వాత మరో సినిమా రాదనుకునేదాన్ని. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో మరదలు రోల్ చేశాను. ఆ చిత్రం నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తర్వాత అన్ని మరదలు పాత్రలే వచ్చాయి. గ్రాఫ్ పడిపోతుందన్న సమయంలో హిట్ పడేది. స్వామి రారా, కార్తికేయ అలా వచ్చినవే” అని పేర్కొంది.
-
Screengrab facebook:swathireddy
-
Screengrab facebook:swathireddy