జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. బీఈ, బీటెక్ విభాగాల్లో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 01వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జనవరి 28న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ప్లానింగ్ విభాగం పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. దేశంలోని 290 నగరాల్లో, విదేశాల్లోని 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. త్వరలో అడ్మిట్ కార్డులు ఇవ్వనున్నారు.