రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని లేదా సరిదిద్దాలని సుప్రీంకోర్టును కోరతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ఎప్పుడూ రాష్ట్రం కలిసి ఉండాలనే కోరుకుంటుందన్నారు. విభజన తీరుపై కేసులు వేశామని, ఏపీ హక్కుల కోసం పోరాడతామన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఆదినుంచీ పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ విధానమని పునరుద్ఘాటించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిలిచాయని గుర్తుచేశారు.
మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోరుతాం: సజ్జల

Courtesy Twitter:YCP