తెలంగాణలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. తాజాగా మంగళ్‌హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. గతేడాది ఆగష్టులో అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కంచన్‌బాగ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ కేసును కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో ఇక్కడి పోలీసులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు.