పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రం అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో దాదాపు 26 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ‘వలిమై’ (36 కోట్లు), రెండో స్థానంలో ‘బీస్ట్’ (27) తర్వాత ఈ చిత్రం మూడో స్థానంలో నిలిచింది. ఇక తెలుగులో దాదాపు రూ.8 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా మణిరత్నం దర్శకత్వంలో రూ.500 కోట్ల బడ్జెట్తో ‘పీఎస్1’ తెరకెక్కించారు. చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలు పోషించారు.