సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ ఆస్తి నష్టం కలిగించిన వారికి యావజ్జీవ శిక్ష పడే చాన్స్ ఉందని.. రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఎవరి మీదైతే FIRలు నమోదవుతాయో వారికి భవిష్యత్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే చాన్స్ లేదని తెలిపారు. పక్కా ప్లాన్ తోనే రైల్వే స్టేషన్ లోకి వచ్చారని, వచ్చేటప్పుడే పెట్రోల్ బాటిళ్లు తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. ఆందోళనకారులు లోకోమోటార్ లో ఉన్న 7 వేల లీటర్ల చమురుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని… వారిని నివారించేందుకే కాల్పులు జరిపినట్లు ఆమె వెల్లడించారు.