అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం ఘటనలో ప్రధాన సూత్రదారుడిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 46 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిలో కామారెడ్డికి చెందిన మధుసుధన్ ప్రధాన నిందితుడని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించినట్లు పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ప్లాన్ వేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కొన్ని ఢిఫెన్స్ అకాడమీల నిర్వహకులు విద్యార్థులను రెచ్చగొట్టినట్లు దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ అల్లర్ల కేసులో మరో 10 మందిని అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు.