దేశంలో ‘అగ్నిపథ్’పై ఓవైపు అల్లర్లు కొనసాగుతుండగా నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రానుంది. మొదటి బ్యాచ్ లో 25,000 మందికి డిసెంబర్ లో శిక్షణ ప్రారంభించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ భన్సీ పొన్నప్ప తెలిపారు. రెండో బ్యాచ్ కు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభం కావొచ్చన్నారు. దాదాపు 40,000 మంది నియామకానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీ మొదటి నియామక ప్రణాళికపై ఈనెల 25నాటికి తెలియజేస్తామని వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. మొదటి బ్యాచ్‌కు నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. వైమానిక దళంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి ఉంటుందని ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు.