కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, హైదరాబాద్‌లో ఈ ఆందోళనల కారణంగా రైళ్లు తగలబడగా.. తాజాగా ఈ అగ్గి సెగ తమిళనాడుకు తాకింది. తమిళనాడులోనూ వార్ మెమొరియల్ వద్ద నిరసనలు చేపట్టారు. రోడ్డుమీద గుంపులుగా వచ్చి అగ్నిపథ్‌ను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి నిరసన కారులను నిరోధిస్తున్నారు.