కోవిడ్‌తో అల్లాడుతున్న చైనాకు సహాయం చేస్తామని తైవాన్ ప్రకటించింది. మానవీయ కోణంలో కోవిడ్‌ని అంతమొందించడంలో డ్రాగన్ దేశానికి సహకరాం అందిస్తామని వెల్లడించింది. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాబోదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. తైవాన్ సరిహద్దుల వద్ద చైనా సైనిక కార్యకలాపాల వల్ల ఎలాంటి లాభం ఒనగూరబోదని హితవు పలికింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, తైవాన్ తమ దేశంలోని అంతర్భాగమంటూ చైనా పలుమార్లు వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల్లోనూ జిన్‌పింగ్ దీనిగురించి ప్రస్తావించడం గమనార్హం.