దేశవాళీలో ఇండియా బ్యాటర్ పృథ్వీ షా సత్తా చాటుతున్నాడు. రంజీ ట్రోఫీలో బుధవారం అసోంతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 379 పరుగులు బాది..టోర్నమెంట్లోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. 400 మార్కును చేరుకోవాలనే కసి తనకు ఎప్పటికీ ఉంటుందని పృథ్వీ షా అన్నాడు. ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా జాతీయ జట్టులో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. 383 బంతుల్లో 379 పరుగులు చేసిన అనంతరం రియాన్ పరాగ్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగాడు.