మార్చి 26,27 వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరిగే వింగ్స్ ఇండియా ఎయిర్‌బస్ షోలో ఇంజనీరింగ్, ఐటీ నిపుణులను నియమించుకోనున్నట్లు కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ మేకర్ ఎయిర్‌బస్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ షో జరగనుంది. ఈ షోకు ఎయిర్‌బస్ అఫీషియల్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థులు ఇక్కడ ఎయిర్ బస్ గురించి, కంపెనీలో కెరీర్ అవకాశాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. 2022 చివరి నాటికి ఐటీ నిపుణుల సంఖ్యను 2,000కు పెంచుకునేందుకు ఎయిర్ బస్ సిద్ధంగా ఉంది.