ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై మూత్రం పోసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బెంగళూరులో అతడిని అరెస్ట్ చేశారు. నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి వృద్ధురాలిపై మూత్రం పోశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎయిర్ ఇండియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అతడిపై 30 రోజుల పాటు నిషేధం విధించింది. పోలీసులు అతడిని బెంగళూరులోని ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు.