విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్ కు ఎయిరిండియా సిద్ధమవుతోంది. 300 విమానాల కొనుగోలు చేయాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌బస్‌కు చెందిన ఎ320 నియో విమానాలు, బోయింగ్‌కు చెందిన 737 మాక్స్ విమానాలు లేదా ఈ రెండింటి మిశ్రమంగా ఈ ఆర్డరు ఉండొచ్చని చెబుతున్నారు. 737 మాక్స్-10 విమానాలు 300 కొనుగోలు చేసేందుకు సుమారు రూ.3.16 లక్షల కోట్లు అవసరం అవుతుంది. భారీస్థాయి ఆర్డర్లు కావడంతో రాయితీలు ఉండే అవకాశముంది.