హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు నేడే శంకుస్థాపన జరగనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చెేపడుతున్న మెట్రో రెండో దశకు CM KCR నేడు శంకుస్థాపన చేయనున్నారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3ను మరింత పొడిగిస్తూ శంషాబాద్ విమానాశ్రయం వరకూ నిర్మిస్తున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు ఇవాళ శ్రీకారం చుడతారు. ఉదయం 10 గంటలకు ఆయన పునాది రాయి వేస్తారు. అనంతరం అప్పా జంక్షన్ పోలీస్ అకాడమీ గ్రౌండ్‌లో సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు.