ఛత్తీస్ గఢ్‌లోని దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండలపై ఈ నెల 11న వైమానిక దాడులు జరిగాయని మావోయిస్టులు పేర్కొన్నారు. ఇందులో మహిళా మావోయిస్టు మృతిచెందారని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారని ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా కోసం కొంతకాలంగా సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ విస్తృతంగా కూంబిగ్ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల కింద జరిగిన ఆపరేషన్‌లో హిడ్మా తప్పించుకున్నాడు.