భారత్-ఆసీస్ నాల్గో టెస్టుకు వేదికైన అహ్మదాబాద్ పిచ్‌పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’ఒక విపరీతమైన చర్యను సమర్థించడానికి ఎప్పుడూ మరొక విపరీతమైన చర్య కారణంగా లేదా సాకుగా ఉండకూడదు’ అని ట్వీట్ చేశాడు. తొలి మూడు టెస్టుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉందనే విమర్శలను తిప్పికొట్టడానికి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ను తయారు చేయడం సరైనది కాదు అన్న రీతిలో ఆకాశ్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.