అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 12న మూవీ థియేటర్లలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను నేడు విడుదల చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో భారీగా కండలు పెంచి వైల్డ్లుక్లో కనిపిస్తున్నాడు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.