పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రావల్పిండి ఎక్స్ ప్రెస్ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.“ ఇది కచ్చితంగా నా కలల ప్రాజెక్ట్. ఇందులో కొనసాగడానికే చాలా ప్రయత్నించాను. దురదృష్టవశాత్తు అన్నీ అనుకున్నట్లు జరగలేదు. ఒప్పంద ఉల్లంఘనలు జరిగాయి. విబేధాలు పరిష్కరించుకోవటంలో వైఫల్యం జరిగింది. దీంతో సినిమాతో నా బంధాన్ని తెంచుకుంటున్నాను.” అన్నాడు.