అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ బాల్ సంధించిన షోయబ్ అక్తర్ రికార్డును అధిగమిస్తానని టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. “ అత్యుత్తమ బౌలింగ్ చేయడంపైనే నా దృష్టి. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే అక్తర్ రికార్డును బద్ధలు కొడతా. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. భారత్ తరఫున మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా. మ్యాచ్ జరిగేటప్పుడు ఎంత వేగంతో బంతి వేస్తున్నామో ఆలోచించం. మా దృష్టంతా బౌలింగ్‌పైనే ఉంటుంది” అన్నాడు.