పవన్ కల్యాణ్, సుజిత్ సినిమాపై పవర్ స్టార్ కుమారుడు అకీరా నందన్ ఆసక్తిగా ఉన్నాడని హీరో అడివి శేష్ తెలిపారు. చిత్రం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడని వెల్లడించారు. హిట్-2 సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు సుజిత్‌కు మూడేళ్ల తర్వాత సరైన సినిమా వచ్చిందన్నారు. బాలీవుడ్ హీరోలు వెంటపడినా ఒప్పుకోలేదని…తెలుగులోనే తీయాలని అనుకున్నట్లు చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన హీరోతో సుజిత్ సినిమా తీయడం సంతోషంగా ఉందన్నారు.