హీరో అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తు బిజీగా మారారు. మరోవైపు సమంత కూడా అనేక మూవీ ప్రాజెక్టులు చేస్తు దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగచైతన్య గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ యాక్టర్ ప్రాచీ దేశాయ్ తో చైతన్య క్లోజ్ గా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇటీవల ప్రాచీ దేశాయ్, విక్రమ్ కుమార్, చైతన్యతో కలిసి డిన్నర్ చేసిన పిక్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. అంతేకాదు తెలుగు కూడా నెర్చుకున్నట్లు చెప్పింది. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని పలువురు అంటున్నారు. అయితే విక్రమ్ కుమార్ డెరెక్షన్లో వీరిద్దరు దూత అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.