బంగార్రాజు తర్వాత అక్కినేని నాగచైతన్య నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయింది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు వెంకట్ ప్రభు సూపర్ హిట్ సినిమా మానాడు కు రీమేక్ గా ఈ సినిమా ఉండబోతోందనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. నాగచైతన్యతో తను ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నానని.. మానాడుకు, చైతూతో సినిమాకు ఎలాంటి పోలిక ఉండదని స్పష్టం చేశాడు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.