టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరో మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2205 బంతుల్లోనే అక్షర్ ఈ ఫీట్‌ని అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో అక్షర్ ఈ ఘనతను అందుకున్నాడు. నాలుగో టెస్టు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ని బోల్డ్ చేసి ఎలైట్ లిస్టులోకి చేరాడు. ఈ సిరీస్‌లో బ్యాటుతోనూ అక్షర్ మెరుగ్గా రాణిస్తున్నాడు.