శ్రీలంకతో రెండో టీ ట్వంటీలో చెలరేగి ఆడిన అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 65 పరుగులు చేసి రవీంద్ర జడేజా(44 ) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు అక్షర్. టీమిండియాలో ఐదో అత్యంత వేగమైన అర్ధసెంచరీగా రికార్డులకెక్కింది. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన భారత జట్టును అక్షర్ గెలిపించినంత పని చేశాడు. సూర్యకుమార్తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో విమర్శకుల ప్రశంసలు దక్కాయి.