బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో అక్షయ్‌కు సౌత్ సినిమాలు, హీరోల గురించి మాట్లాడాలని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అక్షయ్ నేను భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో కలిసి పనిచేస్తానేమో లేదా మరొక సౌత్ హీరోతో కలిసి నటిస్తానేమో అన్నారు. అన్ని ఇండస్ట్రీల వాళ్లు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. అయితే ప్రత్యేకంగా అక్షయ్, అల్లు అర్జున్ పేరు చెప్పడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.