మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై మద్యం కోసం షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే చాలు 10 నిమిషాల్లో ఇంటికే డెలివరీ వస్తాయి. పశ్చిమ బెంగాల్లోని కోల్ కతాలో అక్కడి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ మేరకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇంటివద్దకే లిక్కర్ సేవలు కొనసాగనున్నాయి. మరోవైపు హైదరాబాద్ కు చెందిన ఇన్నోవెంట్ టెక్నాాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ ఈ సేవలకు అనుమతి పొందింది. ఈ నేపథ్యంలో కోల్ కతాలో హైదరాబాద్ స్టార్టప్ మద్యం సేవలను అందించనుంది.