• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • అలర్ట్.. వచ్చే 40 రోజులు జాగ్రత్త!

    రానున్న 40 రోజులు అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు కేంద్రం సూచనలు చేసింది. జనవరిలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. గత అనుభవాల దృష్ట్యా విదేశీ ప్రయాణాల ఆంక్షలపై దృష్టి సారించింది. ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఎయిర్ సువిధ దరఖాస్తును తప్పనిసరి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాతో పాటు జపాన్, థాయిలాండ్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, సింగపూర్ దేశాలకు ఈ నియమాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. కిందటి సారి కూడా ఈ దేశాల్లో కోవిడ్ ప్రబలిన 40 రోజులకు ఇండియాలో ఉద్ధృతి మొదలైంది.