ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ప్రపంచ దేశాలకు అర్థంకావడం లేదు. ఈ నేపథ్యంలోనే చిన్న దేశమైన తైవాన్‌పై చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తైవాన్‌ని తమ దేశంలో విలీనం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి అమెరికాకు రక్షణ శాఖ అధికారుల బృందం తైవాన్ బయల్దేరింది. అక్కడి పరిస్థితులు పరిశీలించి జో బైడెన్‌కి వివరించనుంది. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే అని పేర్కొంది.