స్టేట్ బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ అవుతున్న డబ్బులపై ఆందోళన వద్దని అధికారులు సూచించారు. బ్యాలెన్స్ మెయింటెనెన్స్/ సర్వీస్ చార్జీల కోసం డబ్బులు కట్ అవుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. SBIయేతర ఏటీఎంలలో విత్ డ్రా, మినిమమ్ బ్యాలన్స్ మెయింటెన్ చేయకపోవడం వంటి వాటికి డబ్బులు కట్ అవుతున్నాయని తెలిపారు. అలాగే డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ చార్జీ రూ.125 ప్ల జీఎస్టీ అంటే రూ.147.50 కట్ అవుతుందని చెప్పారు. ఇవి కాకుండా అసంబద్ధంగా శాలరీ కట్ అయితే మాత్రం పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.