ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆలియా భట్ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ స్కాన్ ఫోటోను షేర్ చేసి మా బేబీ త్వరలో రాబోతుందని ప్రకటించింది. ఆలియాభట్, రణ్‌బీర్‌ల వివాహం ఏప్రిల్ 14న జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మూడు నెలల తర్వాత ఈ జంట ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించింది. ఈ వార్త విని చాలా సంతోషంగా ఉందంటూ సోషల్‌మీడియాలో సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.