బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ వరుసగా తెలుగు సినిమాల్లో ఆఫర్ కొట్టేస్తుంది. ఇప్పటికే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. అయితే తాజాగా మరోసారి రాజమౌళి మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా కోసం ఆలియాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.