కూతురు పుట్టిన తర్వాత ఇన్ని రోజులకు ఆలియా భట్ ఫొటో షేర్ చేసుకుంది. ‘మామా’ అని రాసి ఉన్న ఒక టీ కప్పును ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తల్లి అయినందుకు గర్వంగా ఉంది అంటూ పేర్కొంది. కాగా బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లైయిన రెండు నెలలకే ఆలియా గర్భం దాల్చింది. ఈ నెల 6న ఆమె బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుంచి ఆలియా భట్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.
కూతురు పుట్టాక తొలి ఫొటో షేర్ చేసిన ఆలియా

Screengrab Instagram: aaliabutt