కళ్లంతా హార్దిక్ పాండ్యపైనే.. మరి ఏం చేస్తాడో !

Courtesy Twitter: gujarat titans

టాటా ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచులు క్రికెట్ అభిమానులకు ఎంతగానో వినోదాన్ని పంచాయి. అయితే నేడు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఈ సీజన్ నుంచే ఐపీఎల్ ఆడుతున్నాయి. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కాగా, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. గత సీజన్ వరకు ముంబైతో ఆడిన పాండ్య, ఇప్పుడు కెప్టెన్ అవతారం ఎత్తడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది. పాండ్య ఎలా జట్టును నడిపిస్తాడు, ఎలా ఆడుతాడు అనే అంతా చర్చించుకుంటున్నారు. మరి పాండ్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి.

Exit mobile version