నాగార్జున యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నచ్చింది తినండి. నచ్చింది తాగండి. ఎంజాయ్ చేయండి. జంతువులకు ఉన్న స్వేచ్ఛ మనుషులకు లేదు. వైరస్ వచ్చి మగజాతి మొత్తం చనిపోయిన నేనొక్కడినే మిగలాలి. స్త్రీ జాతికి నేనే దిక్కవ్వాలి. 4.5లక్షల ప్రజలు ఒకవైపు కత్రినా కైఫ్ కాళ్లు ఒకవైపు ఉంటే నేను కాళ్లవైపే వెళ్తా’ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.