వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. మంగళవారం పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టేలాగే తమ ప్రణాళిక ఉంటుందన్నారు. ‘నాతో సహా పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలి. మా దగ్గర డబ్బుల్లేవు. మేం డబ్బులు పంచలేం. మీ ఓటు మీరే కొనుక్కుని ఓటేయండి. ఓటును వృథా కానివ్వం. జనసేన సత్తా చాటుతాం. వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుంది’ అని పవన్ అన్నారు.