TS: రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కాములుగా మారాయని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రతి గల్లీలో మద్యం దుకాణాలు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని.. అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వట్లేదని లక్ష్మణ్ చెప్పారు. దిల్లీ లిక్కర్ స్కాంలో సంబంధం లేకపోతే నిరూపించుకోవాలని సూచించారు.
స్కీములన్నీ.. స్కాములయ్యాయి: లక్ష్మణ్

BJP live screegrab(file)